Mega 154 Movie Update: సంక్రాంతి రేసులో చిరు, కొడుకుతో పోటీ తప్పదా?

24 Jun, 2022 12:53 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్‌, గాడ్‌ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్‌ ఫాదర్‌, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్‌ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న బాబీ చిత్రం నుంచి ఓ ఆసక్తిర అప్‌డేట్‌ వదిలాడు డైరెక్టర్‌.

చదవండి: అన్‌స్టాపబుల్‌: రెండో సీజన్‌ తొలి గెస్ట్‌ ఆ స్టార్‌ హీరోనట!

ఇప్పటికీ టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా సంక్రాంతికి కలుద్దాం అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ చిత్రం బృందం పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ముఠా మేస్త్రీ’ త‌ర‌హా మాస్ యాంగిల్‌లో చిరు కనిపించనున్నట్లు గ‌తంలో విడుద‌లైన పోస్ట‌ర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరు అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడు.

చదవండి: పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన సూర్య కూతురు, ఆ సబ్జెక్ట్‌లో వందకు వంద

విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాస్‌మహారాజ ర‌వితేజ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మెగా 154తో పాటు ప్రభాస్‌ ఆదిపురుష్‌, రామ్‌ చరణ్‌-శంకర్‌ ఆర్‌సీ 15 చిత్రాలు కూడా ఉన్నాయి. అదే విధంగా జరిగితే సంక్రాంతి బరిలో తండ్రికొడులకు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నారు. మరి ఇందులో ఎవరి సినిమా ప్రేక్షక ఆదరన పొందుతుందో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు