నవంబర్ 12కి బాణం గురిపెట్టిన నాగశౌర్య

28 Sep, 2021 09:06 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీని నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.  సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల ‘లక్ష్య’ రిలీజ్‌ డేట్‌ ఏమై ఉంటుందో గేస్‌ చేయండంటూ ప్రేక్షకులకి పజిల్‌ విసిరింది మూవీ టీం. అందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఉండగా, తాజాగా నవంబర్‌ 12ని ఖరారు చేసింది చిత్రబృందం. ఆర్చరీ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నాడు. అందులో సిక్స్‌ ప్యాక్‌, పోనీ టెయిల్‌తో ఉన్న లుక్‌ ఆకట్టుకుంటోంది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తుండగా కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా ఈ యంగ్‌ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్న మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

చదవండి: తన ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకున్న నాగశౌర్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు