Samantha Yashoda Movie Update: సమంత ఫస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ షూటింగ్‌ పూర్తి, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

12 Jul, 2022 10:09 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో యశోద ఒకటి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి హరి-హరీశ్‌లో ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గురించిన అప్‌డేట్‌ ఇస్తూ మేకర్స్‌ ప్రకటన రిలీజ్‌ చేశారు. 100 రోజులకు పైగా షూటింగ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన సీజీ వర్క్‌ జరుగుతుందని తెలిపారు.

చదవండి: ‘అచలుడు’గా వస్తు‍న్న సూర్య, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

ఇక ఈ నెల 15 నుంచి అన్ని భాషల్లో డబ్బింగ్‌ మొదలు పెట్టనున్నామన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్‌ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు వెల్లడించారు. యాక్షన్‌, థ్రిల్లర్‌గా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇక ఇందులో సమంత చాలా అద్భుతంగా నటించిందని, ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ ఎంతో అంకితభావంతో నటించిందంటూ ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు ఆమెను కొనియాడారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్ల మంచి స్పందని వచ్చింది. దీంతో ఈ సినిమా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కాగా ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్‌ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి

మరిన్ని వార్తలు