ప్రియుడితో మలైకా చెట్టాపట్టాల్‌.. మాల్దీవుల్లో రచ్చరచ్చ

4 Dec, 2021 19:52 IST|Sakshi

సెలబ్రిటీలు, ప్రేమికులు ఎక్కువగా మాల్దీవులు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. వారికి  ఏమాత్రం సమయం దొరికినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్‌ ప్రేమజంట.. మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌లు కూడా మాల్దీవులకు వెళ్లారు. వారు సరదాగా గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా తీశారు. మలైకా అరోరా తన ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగడమే కాక అక్కడ సైక్లింగ్‌ కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ జంట 2018 నుంచి డేటింగ్‌లో ఉంది.

మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె ఒక డ్యాన్స్‌ రియాలిటీ షోలో టెరెన్స్‌ లూయిస్‌, గీతాకపూర్‌తో కలిసి జడ్జిగా వ్యవహరించారు. అంతేకాకుండా చయ్యా.. చయ్యా పాట.., మున్నీ బద్నాం హుయ్‌ డార్లింగ్‌ తేరే లియే, అనార్కలీ డిస్కో చాలీ పాటల్లో హుషారైన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. మిలింద్‌ సోమన్‌, అనూశా దండేకర్‌లతో కలిసి సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు. అర్జున్‌ కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, యామీ గౌతమ్‌లతో కలిసి హరర్‌ కామెడీ మూవీ భూత్‌ పోలీస్‌, సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌ లో నటించారు. గతేడాది కృతి సనన్‌, సంజయ్‌ దత్‌లతో కలిసి పీరియాడిక్‌ డ్రామా పానిపట్‌లోనూ నటించారు. 

మరిన్ని వార్తలు