కొడుకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మలైకా అరోరా

9 Nov, 2020 13:51 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా ముద్దుల కొడుకు అర్హాన్‌ ఖాన్‌  18వ ఏట అడుగుపెట్టాడు .ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. సోమవారం తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ 47 ఏళ్ల బాలీవుడ్‌ హీరోయిన్‌ తన కొడుకు బర్త్‌డేకి సంబంధించిన డెకెరేషన్స్‌ ఫోటోలను సెలెబ్రేసన్స్‌కు ముందే పోస్టు చేసింది. ఈ ఫొటోలలో తన పెట్‌ అయిన కాస్పర్‌ ఫోటో  పోస్ట్‌ చేసి 'ఆల్‌ సెట్‌ ఫర్‌ భయ్యా బర్త్‌డే' అని క్యాప్షన్‌ ఇచ్చింది. 
  
మలైకా అరోరా సోదరి అయిన అమ్రిత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా అర్హాన్‌కి బర్త్‌డే విషెష్‌ చెప్పింది. ఈ పోస్టులో అర్హాన్‌ ఖాన్‌ నవ్వుతున్న చిన్నప్పటి ఫోటోలు షేర్‌ చేస్తూ, 'ఐ లవ్‌ యూ' అనే క్యాప్షన్‌ ఇచ్చింది. అర్హాన్‌ ఖాన్ బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తమ్ముడైన అర్బాజ్‌ఖాన్‌, మలైకా అరోరా సంతానం. ఈ జంట తమ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి 2017లో  విడాకులతో ముగింపు పలికారు. అర్హాన్‌ తరుచుగా తన తల్లి అయిన మలైకా పోస్టుల్లో కనిపిస్తాడు. ఇటీవల సోహైల్‌ అలీఖాన్‌ కొడుకు నిర్వాన్‌, అర్హాన్ పాత ఫోటోలను మలైకా షేర్‌ చేస్తూ 'వాట్‌ ఆర్‌ యూ థింకింగ్‌ గాయ్స్‌........వర్‌ యూ గోయింగ్‌ ఫర్‌ బదాస్'‌ అంటూ క్యాప్షన్‌ ఇస్తూ.. బంధన్‌ బ్రదర్స్‌, ఫ్యాషన్ ఫార్వర్‌‍్డ, లవ్‌ యూ బోత్‌' హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్‌ చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా