రోడ్డు ఏమైనా నీ సొంతమా.. మలైకపై ట్రోలింగ్‌

4 Mar, 2021 16:12 IST|Sakshi

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా వినగానే గుర్తొచ్చేది ముందుగా ఆమె ఫిట్‌నెస్‌. 40 ఏళ్లు దాటి ఇద్దరు పిల్ల తల్లైనా ఈ భామ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ నేటితరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయాయం చేయడం ఆమెకు అలవాటు. జిమ్‌ వర్కౌట్‌కు సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యువతకు ఛాలెంజ్‌ విసురుతున్నారు. అయితే ఎప్పుడూ జిమ్‌లో వ్యాయామంతోపాటు అప్పుడప్పుడు రోడ్డు మీదకొచ్చి జాగింగ్‌ చేయడం మలైకకు అలవాటే. ఈ క్రమంలో ఇటీవల మరో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌  సర్వేష్‌ శశితో కలిసి బాంద్రాలోని రోడ్లపై జాగింగ్‌కు బయలు దేరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో బ్లాక్‌ స్పోర్ట్స్‌ డ్రెస్, ముఖానికి మాస్కు ధరించిన మలైక జనసందోహం మధ్య జాగింగ్‌ చేస్తున్నారు.

అయితే మలైకా చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడు మధ్యలో జాగింగ్‌ చేయడం చూసి. ‘నడి రోడ్డు మీద జాగింగ్‌ చేస్తున్నారు.. రోడ్డు ఏమైనా మీ సొంతమా. బాంద్రాలో చాలా జాగింగ్‌ పార్క్‌లు ఉన్నాయి. కానీ జనాలు తిరుగుతున్న రోడ్డు మీద జాగింగ్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని మలైకా చూస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా మలైకా తెలుగులో పవన్‌ కల్యాణ్‌ నటించిన గబ్బర్‌ సింగ్‌లో కెవ్వు కేక పాటలో అలరించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.తన భర్త అర్బాజ్ ఖాన్‌కు ఇప్పటికే విడాకులిచ్చిన ఈ సుందరి తనకంటే 12 ఏళ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఇద్దరు బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. డిన్నర్, పార్టీలకు జంటగా హాజరవుతున్నారు. 2017 నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అటు అర్జున్‌ కపూర్‌ 'సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్'‌, 'భూత్‌ పోలీస్'‌ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

చదవండి: ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్‌ హీరో హెచ్చరిక!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు