మాజీ భర్తతో టచ్‌లో ఉన్నా.. కానీ, అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉన్నా: మలైకా

2 Oct, 2022 11:51 IST|Sakshi

భర్త అర్బాజ్‌ఖాన్‌తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్‌ సీనియర్‌ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్‌ఖాన్‌ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్‌ కపూర్‌తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్‌ ఖాన్‌కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్‌ఖాన్‌ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. 

కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్‌ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్‌ బెస్ట్‌ డాన్సర్‌ షోకు ఆమె గతంలో జడ్జిగా ‍వ్యవహరించింది. ఇక అర్బాజ్‌ సోని లివ్‌ షో ప్రసారం చేయనున్న పొలిటికల్‌ డ్రామా తానావ్‌లో నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు