మాస్క్ ఎలా ధ‌రించాలో చెప్పిన న‌టి

29 Jul, 2020 16:57 IST|Sakshi

ముంబై: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో మ‌న జీవ‌న‌శైలిలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా  ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, క్ర‌మం త‌ప్ప‌కుండా చేతులు శుభ్ర‌ప‌రుచుకోవడం త‌ప్ప‌నిసరైంది. కొంత‌మంది మాస్క్‌ను స‌రిగ్గా ధ‌రించ‌డం లేదు. కొంద‌రు ముక్కున క‌వ‌ర్ చేయ‌కుండా, మ‌రికొంద‌రు మెడ‌లో వేలాడదీస్తూ మాస్కులు ధ‌రిస్తున్నారు. మాస్క్ స‌రైన విధానంలో ఎలా ధ‌రించాల‌న్న దానిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ న‌టి మ‌లైకా అరోరా పోస్ట్ చేసింది. (ఇలా చేయడం వల్ల వారంలో కోలుకున్నా: విశాల్‌)

అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా సుల‌భంగా 3 పద్ధ‌తుల్లో మాస్క్ ధ‌రించి అందులో ఏది స‌రైన విధానమో సూచిస్తూ ఓ పోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన  కొన్ని గంట‌ల్లోనే 56 వేల‌కు పైగానే లైకులు వ‌చ్చాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభైన‌ప్ప‌టి  నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు సామాజిక బాధ్య‌త‌గా క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. న‌టి మ‌లైకా సైతం  ప‌సుపు, ఆపిల్‌, అల్లం, వెనిగ‌ర్‌, పెప్పర్‌ని ఉప‌యోగించి త‌యారు చేసుకున్న క‌షాయం తీసుకుంటే మంచిద‌ని  చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. (సంక్రాంతి బ‌రిలోకి బ్యాచ్‌ల‌ర్)

Please wear a mask n wear it the correct way . Protect urself and others 🙏 @my_bmc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా