మాస్క్‌ లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది : హీరోయిన్‌

26 Aug, 2021 13:11 IST|Sakshi

కరోనా మహమ్మారి ప్రజల్లో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్‌ ప్రభావంతో మాస్క్‌, శానిటైజర్‌ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. అసలు మాస్క్‌ పెట్టుకోకపోతే చాలామందికి ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. తాజాగా మలయాళీ భామ మాళవిక మోహనన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'షూటింగ్‌ సమయంలో కఠిన భద్రతా నియమాలు పాటిస్తున్నాం. ​నటీనలులు తప్పా మిగతా అందరూ విధిగా మాస్కలు ధరిస్తారు.

కానీ మేం కానీ షూట్‌ చేస్తున్నంతసేపు మాస్క్‌ తీసేయాల్సి ఉంటుంది.  గత ఏడాదిగా మాస్క్‌ పెట్టుకోవడానికి బాగా అలవాటు పడ్డాం. కానీ ఒక్కసారిగా సెట్లో మాస్క్‌ తీసేయమంటే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది' అని పేర్కొంది.  ఈ అమ్మడు చేసిన  కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పేటా, మాస్టర్‌ చిత్రాలతో గుర్తింపు పొందిన మాళవిక ప్రస్తుతం కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో మారన్‌ చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా ధనుష్‌ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. ఇది వరకే విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం పొందినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయిని, త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇస్తానని వెల్లడించింది. 

చదవండి : డ్రగ్స్‌ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్‌ సంజన
'కథ చెప్పడానికి ఫోన్‌ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'

మరిన్ని వార్తలు