Malaikottai Vaaliban: భారీ బడ్జెట్‌ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్!

12 Feb, 2024 16:32 IST|Sakshi

మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. 

ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్‌ ఇచ్చింది.  కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్‌. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్‌ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega