ఎంతో ప్రత్యేకం.. తనే నా జీవితం: నటుడు

29 Dec, 2020 09:45 IST|Sakshi

తిరువనంతపురం: మలయాళ నటుడు రాహుల్‌ రవి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల స్నేహితురాలు లక్ష్మీ నాయర్‌ను అతడు మనువాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులు చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ రవి- లక్ష్మీ నాయర్‌లకు తోటి ఆర్టిస్టులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన రాహుల్‌.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పూనంబిలి సిరీస్‌లో ప్రధాన పాత్రలో మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: పెళ్లిలో సూపర్‌ స్టార్‌ సందడి, వైరల్‌ వీడియో)

తనే నా జీవితం
ఇక లక్ష్మీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన రాహుల్‌.. ‘‘తనను మొదటి రోజు కలిసినపుడు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో.. ఇప్పుడు కూడా అంతే. అయితే ఈరోజు ఇంకాస్త ఆనందంగా ఉంది... రోజురోజుకీ తను నాకెంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. తను అందమైన చిరునవ్వు.. తను చెప్పే మాటలు.. వింటూ ఉంటే ప్రపంచాన్నే మైమరిచిపోతా.. తను కేవలం నా జీవితంలో ప్రవేశిస్తున్న అమ్మాయి మాత్రమే కాదు.. తనే నా జీవితం.. నా జీవితాన్ని నీ నవ్వులతో వెలిగించినందుకు థాంక్యూ లక్ష్మీ నాయర్‌.. మన పెళ్లిరోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ పెళ్లి వార్తను పంచుకున్నాడు. 

మరిన్ని వార్తలు