Alina Padikkal Marriage: వ్యాపారవేత్తను పెళ్లాడిన ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ .. ఫోటోలు వైరల్‌

31 Aug, 2021 13:00 IST|Sakshi

మలయాళం టీవీ నటి, యాంకర్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ అలీనా పడిక్కల్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మలయాళం బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలీనా.. సోమవారం వ్యాపారవేత్త రోహిత్‌ ప్రదీప్‌ను మనువాడారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. కోవిడ్‌ దృష్ట్యా బంధువులు, కొద్ది మంది స్నేహితులను మాత్రమే తమ వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
(చదవండి: బిగ్‌బాస్‌ 5: ఆ స్టార్‌ సింగర్‌ ఎంట్రీ ఫిక్స్‌!)

కోజ్‌కోడ్‌కు చెందిన రోహిత్‌తో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది అలీనా. కెరీర్‌ పరంగా సెటిల్‌ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకొని, వివాహాన్ని పలుమార్లు వాయిదా వేసుకున్నారు. టీవీ నటిగా పాపులారిటీ రావడంతో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వరించింది. అక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచుకుంది. ఆ షో  తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో బుల్లి తెరపైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలీనా.

మరిన్ని వార్తలు