సినిమా తీస్తానని రూ.7 కోట్లు మోసం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌!

8 May, 2021 10:57 IST|Sakshi

ప్రముఖ మలయాళీ దర్శకుడు, యాడ్ ఫిలిమ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ  శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్‌ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది.

శ్రీకుమార్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. ప్రముఖ నటి మంజు వారియర్‌ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో శ్రీకుమార్‌ మీనన్‌ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు మంజు వారియర్.. శ్రీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓడియన్‌లో హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు.. అతనితో కలిసి పలు యాడ్‌లలో కూడా ఆమె నటించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు