46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మలయాళ చిత్రం పాక

12 Sep, 2021 15:18 IST|Sakshi

‘మల్లేశం’దర్శకుడు రాజ్ రాచకొండ... బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలిసి నిర్మించిన మలయాళం సినిమా ‘పాక’. తెలుగులో ‘మల్లేశం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ‘పాక - ది రివర్ అఫ్ బ్లడ్’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మల్లేశం చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ కోసి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించటానికి ఎన్నికవ్వడం విశేషం. 

ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘మల్లేశం చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు పాక కథ బాగా నచ్చింది. ప్రేమ, క్రూరత్వం గురించి భావోద్వేగాలను ప్రదర్శించే లోతైన కథ. తరచూ గొడవలుపడే రెండు కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే పాక. మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్‌లో చిత్రీకరించాము. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్, జోసెఫ్ మాణికల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోచించారు. సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శింపబడుతోంది’ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు