అమెరికాలో సందడి చేస్తున్న నటి మల్లిక శరావత్‌, వీడియో వైరల్‌

1 Jun, 2021 18:10 IST|Sakshi

లాక్‌డౌన్‌లో సెలబ్రీటీలంతా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడు సినిమాలు, షూటింగ్‌లంటూ బిజీగా ఉండే తారలంతా వ్యాయమాలు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటున్న వీడియోలు, ఫొటోలను పంచుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఇంట్లోనే ఉండగా.. మరికొందరూ లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందే తమకు నచ్చిన ప్రదేశాల్లో వాలిపోయారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్న బాలీవుడ్‌ నటి మల్లిక శరావత్‌ లాస్‌ ఏంజెల్స్‌లోని తన లావిష్‌ విల్లాలో సందడి చేస్తున్న వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది.

తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ స్విమ్మింగ్‌ ఫూల్‌ దగ్గర ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మల్లిక మల్టీకలర్‌ మ్యాక్స్‌ టాప్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చివరిగా 2019లో వచ్చిన బూ సబ్‌కీ ఫటేగీ వెబ్‌సిరీస్‌లో కనిపించిన మల్లిక ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు. అలా మూడు సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్న మల్లికను ఇలా చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. లాక్‌డౌన్‌, కరోనా కాలంలో ఆమె ఎలా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతూ ఆమె యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు.  

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు