అయితే, నా సినిమాలు చూడ‌కు: మ‌ల్లికా

8 Oct, 2020 18:07 IST|Sakshi

సినిమాల ప్ర‌భావం స‌మాజంపై గ‌ట్టిగానే ఉన్న విష‌యం తెలిసిందే. హీరో హెయిర్ క‌ట్‌, హీరోయిన్ వేష‌ధార‌ణ‌, వాళ్ల మ‌ధ్య ల‌వ్‌ట్రాక్.. ఇలా ఎన్నింటినో యువ‌త అనుస‌రిస్తూ ఉంటారు. అక్క‌డితో ఆగ‌కుండా హీరో చేసే స్టంట్లు ప్ర‌య‌త్నించి బొక్క‌బోర్లా ప‌డ్డ‌వారూ ఉన్నారు. నేరాలు- మోసాలు చేస్తూ త‌ప్పుదోవ సైతం ప‌డుతున్నారు. అలా అని ప్ర‌తిదానికి సినిమాను నిందించ‌లేం. దాన్ని వినోదం కోసం చూడాలే త‌ప్ప అందులో ప్ర‌తిదాన్ని ఆచ‌రించాల‌నుకోకూడ‌దు. కాగా ఈ మ‌ధ్యే జరిగిన హ‌థ్రాస్ దుర్ఘ‌ట‌న ప‌ట్ల‌ బాలీవుడ్ న‌టి మ‌ల్లికా శెరావ‌త్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'మ‌హిళ‌ల ప‌ట్ల ధోర‌ణి మారేందుకు దేశంలో సంస్క‌ర‌ణ తీసుకువ‌చ్చేవ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆగ‌వు' అని అభిప్రాయ‌ప‌డ్డారు. (చ‌ద‌వండి: అదో బోగస్‌ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!)

ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజ‌న్‌.. "మీరు చెప్పే మాటలు, బాలీవుడ్‌లో మీరు చేసే పాత్రలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సందేశాలను ప్రధానంగా సినిమాల ద్వారా కూడా పంపించ‌వ‌చ్చ‌ని తెలియ‌దా? నీతి వాక్యాలు వ‌ల్లించేముందు వాటిని మీరు అనుస‌రించి, ఆ త‌ర్వాత మిగ‌తావాళ్ల‌కు చెప్పండి" అని కామెంట్ చేశాడు. దీనిపై కాస్త క‌టువుగానే స్పందించిన మ‌ల్లికా.. "అంటే, నేను న‌టించిన సినిమాలు అత్యాచారాల‌ను ప్రేరేపిస్తున్నాయా? మీలాంటి వాళ్లే మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ బాధ‌పెట్టేది. నా సినిమాలు వ‌ల్ల నీకు అంత ఇబ్బంది అనిపిస్తే చూడ‌టం మానేయండి" అని నోరు మూయించారు. (చ‌ద‌వండి: రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం )

>
మరిన్ని వార్తలు