Mammootty Puzhu Movie: మమ్ముట్టి మిస్టిక్‌ థ్రిల్లర్ 'పుజు'.. నేరుగా ఆ ఓటీటీలోకి

9 May, 2022 16:20 IST|Sakshi

Mammootty Puzhu Movie Released On Sony Liv: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్‌ సినిమాలతో సూపర్‌ హిట్స్ అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్‌ మూవీ 'పుజు'(Puzhu) తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో 'చార్లీ' సినిమా ఫేమ్‌ పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో రతీనా పీటీ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ తండ్రికొడుకుల నేపథ్యంలో మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరెకెక్కినట్లు తెలుస్తోంది. వాసుదేవ్‌ సజీత్‌ మరార్‌ మమ్ముట్టి కొడుకుగా నటిస్తున్నాడు. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సోనీ లివ్‌లో మే 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్‌ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్‌ ఫిల్మ్స్‌, సిన్‌సిల్‌ సెల్యూలాయిడ్‌ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించారు. 

మరిన్ని వార్తలు