275 రోజుల తర్వాత.. స్నేహితులతో సూపర్‌ స్టార్‌..

5 Dec, 2020 17:30 IST|Sakshi

తిరువనంతపురం: మాలమాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టికి సవాళ్లు అంటే ఇష్టం. అందుకే లాక్‌డౌన్‌లో కాలు బయట పెట్టకుండ ఎన్ని రోజుల ఉండగలరో తనకను తానే సవాలు విసురుకున్న విషయం తెలిసిందే. ఇంట్లోవారంత అలా నిత్యవసర సరుకులు తీసుకురమ్మని చెప్పినా కూడా ససేమిరా అంటూ ఇంటిపట్టునే ఉన్నారంట. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో కాస్తా సాధారణ పరిస్థితులు రాగానే మమ్ముట్టి శుక్రవారం రాత్రి బయటకు వచ్చి స్నేహితులతో సరదాగా గడిపారు. దాదాపు తొమ్మిది నెలల(275 రోజులు) తర్వాత ఆయన తన స్నేహితులైన దర్శకుడు ఆంటో జోసెఫ్‌, బదుషా, నటుడు రమేష్‌ పిషరోడితో కలిసీ సాయంకాలం అలా సరదగా బయటకు వచ్చి సులైమాని చాయ్ తాగుతున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (చదవండి: అడుగు బయటపెట్టేది లేదు!)

కాగా మమ్ముట్టి తన తదుపరి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ప్రైస్ట్‌’‌ షూటింగ్‌లో భాగంగా మార్చిలో కేరళలోని ఆయన కొత్త ఇంటికి వచ్చారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి నుంచి లాక్‌డౌన్‌ అమలు కావడంతో కుటుంబంతో కలిసి ఆయన అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో మమ్ముట్టి లాక్‌డౌన్‌లో బయటకు వెళ్లకుండా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండగలనని పరీక్షించుకునేందుకు తనకు తానే సవాలు విసురుకున్నట్లు ఆయన తనయుడు, హీరో దుల్కర్‌ సల్మాన్‌ అగష్టులో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు బోరు కొట్టకుండా ఉండేందకు ఇంట్లో వ్యాయమం చేస్తూ ఫిట్‌నెస్‌ శ్రద్ధ పెట్టారంట. ఇందుకు సంబంధించిన ఫొటోలను దుల్కర్‌ తరచూ సోషల్‌ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వైరలవుతోన్న మమ్ముట్టి వర్క్‌వుట్‌ ఫోటోలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా