వైరలవుతోన్న మమ్ముట్టి వర్క్‌వుట్‌ ఫోటోలు

17 Aug, 2020 14:01 IST|Sakshi

షూటింగ్‌లు, ప్రెస్‌ మీట్లు, ఇండస్ట్రీకి చెందిన పలు కార్యక్రమాలతో బిజీగా ఉండే సినిమా జనాలు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు అనుమతించినప్పటికి చాలా మంది ఇంకా వర్క్‌ మోడ్‌లోకి రాలేదు. అయితే ఈ గ్యాప్‌ను కూడా బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు మన స్టార్లు. ఒకేసారి ఇన్ని రోజులు సెలవు దొరకింది. ఖాళీగా ఉంటే బద్దకంగా తయారవుతామనే ఉద్దేశంతో నచ్చిన వ్యాపకాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటున్నారు సినీ జనాలు. కొందరు వ్యవసాయం, వంటలవైపు మల్లగా.. మరి కొందరు శరీరానికి పని చెప్పే పనిలో పడ్డారు. మళయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కూడా కసరత్తులు చేస్తూ.. బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆదివారం వర్క్‌వుట్‌ సెషన్‌కు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేశారు మమ్ముట్టి.(అడుగు బయటపెట్టేది లేదు!)
 

Work at Home ! 🤔 Work from Home ! 😏 Home Work ! 🤓 No other Work 🤪 So Work Out ! 💪🏻

A post shared by Mammootty (@mammootty) on

గ్రే కలర్‌ టీ షర్ట్‌ ధరించి.. జిమ్‌ గ్లవ్స్‌ వేసుకుని ఉన్న ఫోటోలను​.. ‘వర్క్‌ ఎట్‌ హోం.. వర్క్‌ ఫ్రమ్‌ హోం.. హోం వర్క్‌.. నో అదర్‌ వర్క్‌.. సో వర్క్‌వుట్‌’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజనలు సూపర్బ్‌.. మీరు యువతకు ఆదర్శం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. గత పోస్ట్‌లో క్వారంటైన్‌ పిరియడ్‌లో ఓల్డ్‌ హాబీ పేరుతో.. ప్రొఫెషనల్‌ కెమరాతో  పక్షుల ఫోటోలను తీస్తున్న చిత్రాలను షేర్‌ చేశారు మమ్ముట్టి. ఇక సినిమాల విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు మమ్ముట్టి అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో వచ్చిన షైలాక్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (లాక్‌డౌన్‌లో బ‌రువు పెరిగారా? ఇలా చేయండి)

మరిన్ని వార్తలు