టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పనికి కోపం తెప్పించింది. తాను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాలకు అడ్డు రావడంతో అగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా 'నీ యవ్వా' వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా(SIIMA) అవార్డ్స్- 2023 ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాలకు అతను అడ్డుకోవడంతో కోపంతో కొట్టేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు.
కాగా.. మంచు లక్ష్మి టాలీవుడ్‌లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసింది. అంతే కాకుండా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు, మాన్స్టర్, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు లాస్ వెగాస్ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆమె డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ ఈఆర్ లాంటి హాలీవుడ్ సిరీస్‌ల్లో నటించింది.
ఎవడ్రా మా లచ్చక్క మాట్లాడే అప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నారు ని అవ్వ 😁
హాల్లో డుర్ go behind the camera dude🤣@LakshmiManchu pic.twitter.com/Ry5FBNyN3A
— 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) September 21, 2023