నాన్న.. నాకు అన్నీ మీరే: మంచు లక్ష్మీ

19 Mar, 2021 12:05 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో డైలాగ్‌ కింగ్‌ మోహన్ బాబుది ఓ విలక్షణమైన శైలి.  నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా.. ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు మంచు‌ మోహన్‌ బాబు. క్యారెక్టరైజేషన్ మేనరిజంతో ప్రేక్షకులను మేస్మరైజ్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి చేసుకొని ఇప్పటికీ తన నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సినిమాకు నటనలో కొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ.. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఈ పెదరాయుడు.

నేడు మోహన్‌బాబు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నటుడికి సినీ ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి.. తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘నా జీవితంలో గొప్ప వ్యక్తి నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు మీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. మీరే నా బలం, ప్రేరణ. నాకు అన్నీ మీరే. ఈరోజు నేనిలా ఉండటానికి కారణం మీరే. మీరు లేకుండా నేను లేను.’ అంటూ తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అలాగే మంచు మనోజ్‌ కూడా తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

కాగా ప్రస్తుతం మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు భార్య విరానిక ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ ప్లేలో మోహన్ బాబు కూడా పాలు పంచుకుంటున్నట్లు సమాచారం.

చదవండి: 
మహేశ్‌బాబు లగ్జరీ కారవాన్‌‌‌: ఖరీదు ఎంతో తెలుసా?

మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు