Manchu Lakshmi: మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా పట్టించుకోలేదు..

7 Mar, 2023 13:43 IST|Sakshi

ఈ మధ్య ఎయిర్‌ లైన్‌ సంస్థ వల్ల సినీ సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎయిర్‌ లైన్‌ ఇండిగో సం‍స్థ వల్ల నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.  స్టార్‌ హీరో రానా నుంచి యాంకర్‌ అనసూయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ వరకు ఇలా ఎందరో ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి చేరింది. ఇటీవల తిరుపతి వెళ్లిన ఆమెకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది.

చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్‌ హీరో

తన పర్స్‌ పోయిందని, 103 డిగ్రీల జ్వరంలో బాధపడుత్ను తను దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేచి చూడాల్సి వచ్చిందంటూ ఇండిగో సిబ్బంది నిప్పులు చెరిగారు. ఈ మేరకు లక్ష్మి మంచు ట్వీట్‌ చేశారు. సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు. మొదట ఈ ట్వీట్‌కు ఇండిగో ఎయిర్‌లైన్‌ తప్పుడు ట్యాగ్‌ జోడించిన మంచు లక్ష్మి ఆ తర్వాత మరో ట్వీట్‌ చేశారు.

చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తు‍న్నారు: కాజల్‌ అగర్వాల్‌

‘ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. విమానంలో నా పర్స్‌ పోయింది. సాయం అడిగితే ఎవరూ రెస్పాండ్‌ అవ్వలేదు. 103 డిగ్రీల జ్వరంతో దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేయిట్‌ చేశా. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. నేను హెల్స్‌ అడిగిన క్షణాల్లోనే వారు కనుమరుగయ్యారు. ఇందుకు నాకు ఉన్న హైఫివర్‌ కూడా వారిని కదించలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనికి స్పందించిన ఇండిగో యాజమాన్యం ‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీరు మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని అనుకుంటున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చింది. 

మరిన్ని వార్తలు