ఫైట్‌.. హైలైట్‌ 

9 Oct, 2023 03:31 IST|Sakshi
మంచు లక్ష్మి  

మంచు లక్ష్మి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌–అమెరికా ఇండియా ఎంటర్‌టైన్మెంట్స్‌పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్‌ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది.

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాతో పాటు ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్‌ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్‌తో ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా మొదలై కంప్లీట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తలు