Manchu Lakshmi: నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నాను

9 Mar, 2022 15:33 IST|Sakshi

మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే అంటూ నోరు విప్పింది. దీంతో విలక్షణ నటుడు మోహన్‌ బాబు కూతరు సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా మంగళవారం(మార్చి 8) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం మంచు లక్ష్మి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్‌ కౌచ్‌, బాడి షేమింగ్‌పై స్పందిందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అవును ఇవన్ని నేను ఫేస్‌ చేశాను. సినీ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన నాకు ఇలాంటివి ఎదురవ్వవు అనుకున్నాను.

చదవండి: రెమ్యునరేషన్‌లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?

కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాను. మోహన్‌ బాబు కూతురిని అయిన నేను సైతం కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. అంతేకాదు బాడీ షేమింగ్ ట్రోల్స్‌ బారిన కూడా పడ్డాను. నా శరీరాకృతి కర్వ్డ్‌గా ఉండటం వల్ల కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘సినీ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చింది కదా తనకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు. ఏ రంగంలో అయిన ప్రతీ మహిళా ఇవన్నీ ఫేస్‌ చేస్తుంది. మహిళలు పని చేసే ప్రతి చోట కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ, బ్యాంకింగ్‌ సెక్టార్‌ ఇలా అన్ని చోట్ల ఉంది. నా స్నేహితుల్లో కొంతమంది ఇలాంటి వాటి గురించి నాకు చెబుతుంటారు.

చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్‌, ఇది నాగ చైతన్యకు పోటీగానా?

ట్రోల్స్‌, బాడీ షేమింగ్స్‌ కూడా కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్నిచోట్లా ఉన్నాయి’ అని పేర్కొంది. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మహిళలు ముందుకు సాగాలని, మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంది. అలాగే ఈ జీవితం చాలా చిన్నదని, దాంట్లో వీటికి స్థానం ఇవ్వకుడదని చెప్పింది. ఇవేవి పట్టించుకోకుండా సంతోషంగా ఉండాలంది. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్.. ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదని, మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ సందేశం ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె మళయాళం, తమిళ సినిమాల్లో చేస్తోంది. మోహన్‌ లాల్‌ మానస్టర్‌ చిత్రంలో మంచు లక్ష్మి కీ రోల్‌ పోషిస్తుండగా.. ఇక తమిళంలోని ఓ సినిమాలో లేడి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. 

మరిన్ని వార్తలు