వెరైటీగా ట్రై చేసి ట్రోల్స్‌ బారిన పడ్డ మంచు లక్ష్మీ

25 Apr, 2021 16:09 IST|Sakshi

మంచు లక్ష్మీప్రసన్న.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లనేని పేరు. విలక్షణ నటుడు మోహన్‌ బాబు కూతరిగానే కాకుండా నటిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆమె తన ఇంగ్లీష్‌తో ఎంత పాపులర్ అయ్యారో‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన తీరుతో తరచూ ట్రోల్స్‌ గురయ్యే మంచు లక్ష్మీ తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే తరచూ టీ-షర్టు, ప్యాంటు దుస్తుల్లోనే యోగా, వ్యాయమం వీడియోలు షేర్‌ చేసే ఆమె ఈ సారి వెరైటిగా చీరలో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ‘ఈ మంచు వారమ్మాయి కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఆమె రూటే సపరేటు’ , ‘మీరు ఒక లెజెండ్ కూతురని మర్చిపోకండి’ , ‘ఏంటో నువ్వు ఆ దేవుడికే అర్ధం కావాలి.. ఎవరికీ అర్ధం కావు’ అని కామెంట్స్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. అంతేగాక ఇటీవల కరోనా బారిన పడ్డ మంత్రి కేటీఆర్‌కు మంచు లక్ష్మీ ట్విటర్‌ వేదికగా ఓ సలహా ఇచ్చి ట్రోల్స్‌ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇక ఆ వెంటనే ఓ శాస్త్రవేత్త మరణంపై వావ్‌ అంటు ఆమె చేసిన పోస్ట్ చర్ఛనీయాంశంగా మారింది. అయితే తనపై వచ్చే ట్రోల్స్‌ను ఏమాత్రం లెక్క చేయకుండా తను చేయాల్సింది చేసుకుంటూ పోతుంది ఈ మంచు వారి అమ్మాయి. 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

చదవండి: 
కేటీఆర్‌కు మంచు లక్ష్మి సలహా.. నెటిజన్ల కౌంటర్‌! 
మంచు లక్ష్మీ మాస్‌ డ్యాన్స్‌ చూశారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు