అలా చేస్తే కరోనా భయం పోతుందట: మంచు లక్ష్మీ ట్వీట్‌

6 May, 2021 20:55 IST|Sakshi

మంచు లక్ష్మీ ప్రసన్న.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లనేని పేరు. ఈ మధ్య క్వాంటైన్‌లో అందరిక పలు సలహాలు ఇస్తూ ఆమె పెట్టె పోస్టులు సోషల్‌ మీడియాలో ఎంత హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఇటీవల కరోనా బారిన పడిన మంత్రి కేటీఆర్‌కు మంచు లక్ష్మీ ఇచ్చిన సలహా హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

‘త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ ఆమె చేసిన ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేశారు.  ఇదిలా ఉండగా ఇటీవల ‘ఉదయాన్నే మూడు షాట్ల మందు తాగాకా ఎవరైనా బ్లాక్‌ కాఫీ తాగుతారా’ అంటూ ట్వీట్‌ చేయడంతో.. కరోనాతో అందరూ బాధపడుతుంటే ఇప్పడు మాకు నీ తాగుడు పురాణం అవసరమా అంటూ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా ఈ మంచు వారి అమ్మాయి మరో ట్వీట్‌ చేసి ట్రోల్స్‌ బారిన పడింది.

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఎక్కువ శాతం ప్రజలు ఇంట్లో ఉండేందుకే ఆసక్తిని చూపుతున్నారు. అలాంటికి వారిని ఉద్దేశిస్తూ ఇటీవల ‘ఈ కష్టకాలంలో భయాలన్నీ పోవాలంటే.. మీ పెళ్లి వీడియోలు చూడండి’ అని ఉన్న పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ పోస్టు మంచు లక్ష్మీ షేర్‌ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. అది చూసిన నెటిజన్లు ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ పెళ్లి వీడియోలు పెట్టండి’, ‘హమ్మయ్య.. ఇంకా నయం మీ మూవీస్‌ చూడమలేదు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

చదవండి: 
వెరైటీగా ట్రై చేసి ట్రోల్స్‌ బారిన పడ్డ మంచు లక్ష్మీ 
త్వరగా కోలుకో బడ్డీ: నెటిజన్ల రచ్చ మామూలుగా లేదుగా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు