మంచు లక్ష్మికి షాకిచ్చిన హ్యాకర్లు

11 May, 2021 14:08 IST|Sakshi

మంచు లక్ష్మి​ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారావిడ. బుల్లితెర, వెండితెర ఇటీవల డిజిటల్‌ మీడియాలోనూ సత్తా చాటుతున్నారు. కూతురు మంచు నిర్వాణ విద్యా ఆనంద్‌తో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల పెంపకం, వాళ్లు చేసే అల్లరిని ఎలా అర్థమయ్యేలా వారికి చెప్పాలి? లాంటి పేరేంటింగ్‌ గైడ్‌లైన్స్‌తో కూడిన వీడియోలను చిట్టి చిలకమ్మ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా షేర్‌ చేస్తున్నారు. అయితే హ్యాకర్లు మంచు లక్ష్మికి షాకిచ్చారు. చిట్టి చిలకమ్మ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాకింగ్‌కు గురయ్యిందని, ఆ ఛానల్‌ నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని తెలిపారు. తన టీం దీనిపై పనిచేస్తోందని, వీలైనంత త్వరగా అకౌంట్‌ రికవర్‌ అయ్యేలా చూస్తున్నారని చెప్పారు.

గతంలోనూ మంచు లక్ష్మి సహా మంచు మనోజ్‌ వాట్సాప్‌ అకౌంట్‌లు హ్యాకింగ్‌కు గురయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మంచు లక్ష్మి చేసే పోస్టింగులు ట్రోల్స్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌ అయ్యిందన్న లక్ష్మి ట్వీట్‌పై కూడా నెటిజన్లు తనదైన స్టైల్‌లో ఫన్నీగా ట్రోల్స్‌ చేస్తున్నారు. 

చదవండి : వచ్చే ఏడాదే రకుల్‌ ప్రీత్‌ పెళ్లి : మంచు లక్ష్మీ
లైవ్‌లో సింగర్‌ సునీతను వాట్సాప్‌ నెం అడిగిన నెటిజన్‌..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు