రామ్‌ చరణ్‌తో మంచు వారి దీపావళి సెలబ్రేషన్స్‌

17 Nov, 2020 13:31 IST|Sakshi

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు చిన్న కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్‌ విభిన్న కథాపరమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దొంగ దొంగది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మనోజ్‌ 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరగా కనిపించాడు. అప్పటి వరకు అంతా సవ్యంగా ఉన్నా కూడా ఉన్నట్లుండి భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. దీంతో దాదాపు మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నాడు. అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్‌ సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది మనోజ్‌కు కంబ్యాక్‌ సినిమా అనే చెప్పాలి. చదవండి: చలికి వెరవని జక్కన్న టీం

ఈ క్రమంలో దీపావళి పర్వ దినాన్ని మంచు మనోజ్‌ తన ఇండస్ట్రీలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన రామ్‌ చరణ్‌తో జరుపుకున్నారు. మనోజ్‌ తన సోదరి మంచు లక్ష్మీ, రామ్‌ చరణ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ ఫోటోలను మనోజ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దీపావళి పండుగ జరపుకోవడం సంతోషఃగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు దీపావళి అనంతరం వచ్చే భగినీ హస్త భోజనం(భాయ్‌ దూజ్‌) వేడుకలను మంచు లక్ష్మీ ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు తమ్ముళ్లతో (విష్ణు, మనోజ్‌) కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. సోదరులకు భాయ్‌ దూజ్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మంచు విష్ణు, మనోజ్‌లే తనక బలమని చెప్పుకొచ్చారు..

మరిన్ని వార్తలు