‘కార్తీకదీపం’ పై మంచు లక్ష్మీ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన ‘డాక్టరు బాబు’

22 May, 2021 17:22 IST|Sakshi

Karthika Deepam : బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్‌ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ చూస్తామా? అని తహతహలాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్‌ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్‌కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచీ పాజిటివ్‌ టాక్‌తో టాప్‌ రేటింగ్ రాబడుతూ దేశంలోనే అత్యధిక రేటింగ్‌ సాధించిన మొదటి సీరియల్‌గా నిలిచింది. ఈ సూపర్‌ హిట్‌ సీరియల్‌కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్‌గా ఉన్నారు.  ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. ‘కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీగారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ట్వీట్‌ని డాక్టరు బాబు(నిరుపమ్ ) షేర్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పాడు. 

చదండి:
కారీక దీపం.. దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు