శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్‌, లక్ష్మి

21 Aug, 2021 14:10 IST|Sakshi

హీరో మంచు మనోజ్‌, మంచు లక్ష్మీ ప్రసన్నలు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండుగ సందర్భంగా వారిద్దరూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంచు మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్భంగా తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. అంతేగాక లక్ష్మీ, తాను అనుకోకుండా ఇక్కడికి వచ్చామ​న్నారు.

చదవండి: MAA Elections: త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది: మంచు విష్ణు

ఇద్దరూ వేరువేరుగా ప్లాన్‌ చేసుకుని అనుకోకుండా ఇక్కడ కలిశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన సినిమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే దీనిపై అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు కూడా తెలిపాడు. ఇక తాను కొత్తగా ఓ బిజినెస్‌ మొదలు పెట్టబోతున్నట్లు కూడా వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కొత్త ఓ వెంచర్‌ను మొదలు పెట్టబోతున్నానని పేర్కొన్నారు. 

చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు