Mohan Babu : పెళ్లిలో ఎమోషనల్‌ అయిన మౌనిక.. ఓదార్చిన మోహన్‌ బాబు

4 Mar, 2023 13:48 IST|Sakshi

మంచు మనోజ్‌-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్‌ మౌనికారెడ్డి మెడ‌లో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుతో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్‌ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్‌ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి.

కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్‌ బాబు మనోజ్‌ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్‌ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్‌ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్‌లో మనోజ్‌-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా

మరిన్ని వార్తలు