పెద్ద మనసు చాటుకున్న మంచు మనోజ్‌

22 Nov, 2020 16:10 IST|Sakshi

హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బోన్‌ కేన్సర్‌ బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు. అతనికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు.  వివరాల్లోకి వెళితే.. ఓ బాబు బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స చేయించే స్థితిలో లేరని తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్, సోనూసూద్‌కి  ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. అందులో మనోహర్‌ బాబు అనే వ్యక్తి మాట్లాడుతూ..  తాను ఆటో డ్రైవర్‌ని అని, తన బిడ్డకు చికిత్స అందించేందుకు డబ్బులు లేవంటూ సాయం చేయాలని కనీళ్లు పెట్టుకుంటూ అభ్యర్థించాడు. ఆ ట్వీట్‌ చూసి చలించిన మనోజ్‌.. వారికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు.
(చదవండి: డైలాగ్‌ కింగ్‌ 45 ఏళ్ల సినీ ప్రయాణం)

‘దయచేసి నా ఇన్‌బాక్స్‌కి అన్ని వివరాలు పంపండి. ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లు కూడా పంపండి. ధైర్యంగా ఉండండి. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ రీట్వీట్‌ చేశాడు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మనోజ్‌ను మరో సోనూసూద్‌ అంటూ కొనియాడుతున్నారు.  ఆయనను మరో సోనూసూద్ అని కొనియాడుతున్నారు. ‘ దైవం మనుష్య రూపేణా నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నయ్య’, ‘మీరు రియల్‌ హీరో అన్నయ్య’, ‘ఇంత త్వరగా రియాక్షన్ అసలు ఎవరు ఊహించి ఉండరు అన్న. సమాజానికి ఏం జరిగినా సమాజంలో ఏం జరిగినా ముందు ఉండేది నువ్వే సామి. నీ మానవత్వానికి మనుషులు శిరస్సు వంచి జీవితాంతం నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నారు మనోజ్ అన్న’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలోనూ​ మంచు మనోజ్‌ వలస కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. సొంత డబ్బులతో హైదరాబాద్‌లో ఉన్న కార్మికులను స్వగ్రామాలకు తరలించారు. 


 

మరిన్ని వార్తలు