కేటీఆర్‌ను కలిసిన టాలీవుడ్‌ హీరో

10 Jan, 2021 14:30 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆదివారం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశాడు. ఈ సందర్భంగా తను త్వరలో ప్రారంభించబోయే ఓ ప్రాజెక్టు గురించి మంత్రికి వివరించాడు. ఈ ప్రాజెక్టుకు కేటీఆర్‌ తన మద్దతివ్వడంతో మనోజ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ‘ఒక పెద్ద, గొప్ప కార్యం మొదలు కానుంది. నా కొత్త ప్రాజెక్టు, స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుటైన్‌మెంట్‌ ద్వారా యువతకు, సీనియర్లకు సాయం చేయాలనుకునే ఆలోచనను కేటీఆర్‌ గారితో షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి మీరు మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు. నా కల త్వరలోనే సాకారం కానుంది. వేచి ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. చదవండి: అభిమానులకు షాక్‌ ఇచ్చిన హీరో

ఇదిలా ఉండగా  మూడేళ్లుగా సినిమాలకు విరామం ఇచ్చిన మనోజ్‌ త్వరలో ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. అహం బ్రహ్మస్మినే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. ఇవి వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి. ఇందులో ఓ సినిమా కోసం మనోజ్‌ ఏకంగా 15 కిలోలు సన్నబడ్డాడు. మనోజ్‌ ఒక్కసారిగా ఇలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: చైతూ, సాయి పల్లవి ‘లవ్ ‌స్టోరీ’ టీజర్‌ రిలీజ్‌

మరిన్ని వార్తలు