అభిమానులకు షాక్‌.. భారీగా బరువు తగ్గిన హీరో

25 Dec, 2020 12:10 IST|Sakshi

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు చిన్న కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు వారబ్బాయి మనోజ్‌ విభిన్న కథాపరమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దొంగ దొంగది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మనోజ్‌ 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరగా కనిపించాడు. కుటుంబ పరమైన సమస్యలతో ఇబ్బంది పడిన మనోజ్‌ తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మూడేళ్లపాటు సినిమాలకు, బయటి ప్రపంచానికి దూరంగా గడిపాడు. అయితే సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. చదవండి: రామ్‌ చరణ్‌తో కేక్‌‌ కట్‌..

అహం బ్రహ్మాస్మి సినిమానే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. ఇవి వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్‌ భారీగా బరువు తగ్గి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఓ సినిమా కోసం మనోజ్‌ ఏకంగా 15 కిలోలు సన్నబడ్డారు. బరువు తగ్గాక దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో ఆయన పోస్టు చేశాడు. ట్విటర్‌లో న్యూ ప్రొఫైల్‌ పిక్‌గా పోస్టు చేశాడు. అలాగే ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. వీటిని బీఏ రాజు రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక ఒక్కసారిగా ఇలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే తన సినిమాలకు ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు. చదవండి: తేజ్, మ‌నోజ్.. 'బిల్లా-రంగా'!

మరిన్ని వార్తలు