Manchu Manoj: యాక్టింగ్‌ ఆపేశాడు, కెరీర్‌ ఖతమన్నారు.. విన్నాను, మౌనంగా భరించా

23 Sep, 2023 10:16 IST|Sakshi

రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌.. వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు 2017లో వచ్చింది. తర్వాత వచ్చిన సినిమాల్లో అతిథిగా మెరిశాడే తప్ప హీరోగా ఒక్క మూవీలోనూ కనిపించలేదు. దీంతో ఆయన పనైపోయింది, సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి సినిమా ప్రకటించాడు. కానీ, ఆ మూవీ గురించి తర్వాత ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. 

ఇటీవలే గుడ్‌న్యూస్‌.. అంటూ వాట్‌ ద ఫిష్‌ అనే సినిమా ప్రకటించాడు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. సేమ్‌ టు సేమ్‌.. ఈ సినిమా గురించి కూడా మళ్లీ ఎటువంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. ఈ తరుణంలో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు మనోజ్‌.. ఓ ఓటీటీ కోసం ర్యాంప్‌ ఆడిద్దాం అనే షో చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు.

'నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్‌గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్‌ స్టార్‌ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌, అరుపులు, కేకలు.. ఇలా ఓ పండగలా జరిగిన నా లైఫ్‌లోకి సడన్‌గా ఓ సైలెన్స్‌ వచ్చింది. మనోజ్‌ అయిపోయాడన్నారు, కెరీర్‌ ఖతమన్నారు, యాక్టింగ్‌ ఆపేశాడు.. ఇంక తిరిగి రాడన్నారు.. ఎనర్జీ స్టార్‌లో ఎనర్జీ తగ్గిందన్నారు.. విన్నాను, చూశాను, మౌనంగా భరించాను.. తిరిగిస్తున్నాను' అని ఈ ప్రోమోలో చెప్పుకొచ్చాడు మనోజ్‌. ప్రస్తుతం మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

చదవండి: మార్క్‌ ఆంటోని సక్సెస్‌.. 11 ఏళ్ల పోరాటం తర్వాత విశాల్‌కు సక్సెస్‌

మరిన్ని వార్తలు