దాసరి తర్వాత నేను అంతలా గౌరవించేది ఆయననే: మంచు విష్ణు

13 Sep, 2022 21:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మీయులు ఎంతో మంది దూరమైనా ఏనాడు సంతాప సభకు వెళ్లింది లేదని.. తొలిసారిగా సంతాప సభకు వచ్చానంటూ మోహన్‌బాబు ఎమోషనల్‌ అయ్యారు. మంగళవారం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, జీవిత, కె.ఎస్ రామారావు, కె.ఎల్ నారాయణ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నన్ను నోరారా అరేయ్‌ అని పిలిచే నటుడు కృష్ణంరాజు. నన్ను మొట్టమొదట బెంజికారు ఎక్కించింది ఆయనే’ అంటూగుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నానంటూ మోహన్‌బాబు భావోద్యేగానికి గురయ్యారు.

ఇలాంటి సభలో ఏనాడు మాట్లాడుతానని అనుకోలేదని మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు తనతో చెప​చెప్పారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు నాన్నగారు వద్దన్నా.. వారించి మరీ నన్ను పోటీ చేయించారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించేది కృష్ణంరాజు గారినే. నెల రోజుల కిందట ఆయనను కలిశాను. మా అసోసియేషన్‌లో జరిగే ప్రతి పనిని పదో తేదీ కల్లా చెప్పేవాళ్లం. ఇప్పుడు ఆయన మనకు భౌతికంగా దూరమైనా సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారని' మంచు విష్ణు వ్యాఖ్యానించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!)

మరిన్ని వార్తలు