‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ వచ్చేస్తోంది..

2 Jun, 2021 08:43 IST|Sakshi

ఐదు వందలయాభైకి పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మంచు మోహన్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూన్‌ 4న విడుదల చేయనున్నారు. ‘‘వాస్తవ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్‌బాబు గారి ఇమేజ్‌కు తగ్గట్లు ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్, ఎమోషన్‌ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు