కుమార్తె చాలెంజ్‌.. మంచు విష్ణు కొత్త అవతారం

27 May, 2021 20:04 IST|Sakshi

దేశాన్ని ఏలే రాజైనా తల్లికి బిడ్డే అనేది పెద్దలు చెప్పే మాట. అలానే ఎంత గొప్ప స్థితిలో ఉన్న వారైనా సరే తమ కడుపున పుట్టిన బిడ్డల దగ్గర సామాన్యులే. బయట వీరి మాటకు ఎదురు చెప్పే వారుండరు.. ఇక ఇంట్లో కడుపున పుట్టిన బిడ్డల మాటకు వీరు కట్టు బానిసలు. హీరో మంచు విష్ణు కూడా ఇదే కోవలోకి వస్తారు. బిడ్డల కోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఆ వివరాలు.. గతేడాది లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి విష్ణు గడ్డం పెంచుతున్నారు. అయితే ఈ గడ్డం ఆయన పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తెగ విసిగిస్తుందట. దాంతో విష్టు కుమార్తె అరియాన ఈ సమస్య గురించి తన తాత మోహన్‌బాబుకు ఫిర్యాదు చేసింది. మా నాన్న గడ్డం తీస్తే.. నేను నెల రోజుల పాటు తన మాట వింటాను అని తన తాతయ్య సమక్షంలో విష్ణుకు చాలెంజ్‌ చేసింది. 

కుమార్తె విసిరిన చాలెంజ్‌ని స్వీకరించారు విష్ణు. ‘‘నా కుమార్తె ఇంత వరకు నా మట వినలేదు.. అలాంటిది నెల రోజుల పాటు నేను ఏం చెప్తే అది వింటానని ప్రామిస్‌ చేసింది. తనకే కాదు.. ఇంట్లో వాళ్లందరికి నా గడ్డం తెగ చిరాకు తెప్పిస్తుంది. అందుకే తన చాలెంజ్‌ యాక్సెప్ట్‌ చేస్తున్నాను’’ అంటూ క్లీన్‌షేవ్‌ చేసుకున్నారు. ఇక ఈ మొత్తం సీన్‌ని ఆయన అక్క మంచు లక్ష్మి వీడియో తీశారు. షేవ్‌ చేసుకున్న తర్వాత విష్ణు తన చిన్న కుమార్తె కొత్త అవతారంలో ఉన్న తండ్రిని చూసి షాకవుతుంది. చివరకు పిల్లలందరు తండ్రి మీద ముద్దుల వర్షం కురిపిస్తారు. ఇక పిల్లల కోసం పొడుగాటి గడ్డం త్యాగం చేసిన విష్ణుని మోహన్‌బాబు దంపతులు అభినందిస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

చదవండి: ఈ అవార్డు ఉత్సాహాన్నిచ్చింది: మంచు విష్ణు

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు