మహేశ్‌ బాబు అందానికి సీక్రెట్‌ అదే : విష్ణు

16 Jan, 2021 16:20 IST|Sakshi

టాలీవుడ్‌లో అందమైన హీరో అంటే టక్కున గుర్తొచ్చే ఒకేఒక పేరు మహేశ్‌ బాబు. ఆయన అందానికి  హీరోయిన్లతో పాటు సాటి హీరోలు కూడా ఫిదా అవుతారు. అందంతో పాటు ఆయన మంచితనాన్ని కూడా కొనియాతున్నారు. ఓ సందర్భంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ కూడా మహేశ్‌ బాబు నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగితే అందం అని సమాధానం చెప్పారు. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు కూడా మహేశ్‌ బాబు అందంపై కామెంట్ చేశాడు.

 మహేశ్‌తో కలిసున్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్న మంచు విష్ణు... సూపర్‌ స్టార్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. కాగా ఆ ఫొటోలో మంచు విష్ణు, విరానికా, మహేశ్ బాబు, నమ్రత ఉన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన మంచు విష్ణు భార్య విరానికా పుట్టినరోజు వేడుకలో వీరంతా పాల్గొన్నారు. ఇక ఈ ఫోటోని విష్ణు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ ఫొటోలోని ఒక వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిలా మారిపోతున్నారు. రోజురోజుకి మరింత అందంగా తయారవుతున్నారు. దీనికి ఆయన మంచి తనం, దయా హృదయమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను’అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

మంచు విష్ణు ట్వీట్‌కు మహేశ్‌ బాబు కూడా స్పందించారు. గత రాత్రి అద్భుతంగా గడిచిందని, తమకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటూ మంచు విష్ణు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు తన అభిమాన హీరో అందాన్ని పొగుడుతూ మంచు విష్ణు చేసిన ట్వీట్‌పై మహేశ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేశ్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారి వారి పాట’ చేస్తున్నాడు. మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’మూవీలో నటిస్తున్నాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు