Manchu Vishnu: వరుణ్‌ తేజ్‌ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్‌, ట్వీట్‌ వైరల్‌

8 Apr, 2022 14:09 IST|Sakshi

Manchu Vishnu Comments On Varun Tej Ghani Movie: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘గని’ మూవీ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్‌ 8న) థీయేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గనితో తొలిసారి బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీపై ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కామెంట్స్‌ చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది.

చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్‌’ గ్లింప్స్‌, ఆడియన్స్‌కి ప్రశాంత్‌ నీల్‌ డబుల్‌ ట్రీట్‌

ఈ రోజు గని రిలీజ్‌ సందర్భంగా మంచు విష్ణు వరుణ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు. ‘ఆల్‌ ది బెస్ట్‌ మై బ్రదర్‌ వరుణ్‌  తేజ్‌. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చాడు. ఇక దీనిపై నెటిజన్లు, మెగా ఫ్యాన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఓ వర్గం నెటిజన్లు అయితే ఆయన ట్వీట్‌పై నెగిటివిటి ప్రచారం చేస్తూ కామెంట్స్‌ చేస్తుండగా.. వారందరికి విష్ణు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. కాగా నేడు విడుదలైన ‘గని’ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంటుంది. 

చదవండి: Ghani Review: ‘గని’ పంచ్‌ ఎలా ఉందంటే..

మరిన్ని వార్తలు