సన్నీ లియోన్‌తో మంచు విష్ణు ఫన్నీ గేమ్‌, నెటిజనుల సందడి!

15 Apr, 2022 13:20 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ లీయోన్‌తో కలిసి ఒక గేమ్‌ ఆడారు. ఒకరి తరువాత  ఫన్నీ గేమ్‌ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. బాల్యంలో  ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు  కమెంట్‌  చేయగా,  మరింత ఫన్నీగా, మరికొందరు  స్పందించారు.

సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్‌ చల్‌ చేసింది. కాగా విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌  జరుపు కుంటోంది.  ఈ క్రమంలో షూటింగ్‌ బ్రేక్‌లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు.

మరిన్ని వార్తలు