Manchu Vishnu Ginna Trailer: 'జిన్నా' ట్రైలర్ రిలీజ్.. కామెడీ అదిరిపోయింది..!

5 Oct, 2022 18:44 IST|Sakshi

మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్‌ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. దసరా కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృదం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. 

ఇవాళ విడుదలై ట్రైలర్‌ చూస్తే కామెడీ, హార్రర్‌ను తలపిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.  

మరిన్ని వార్తలు