వైరల్‌గా మారిన ఒరిజినల్‌ గ్యాంగస్టర్ల ఫొటోలు

21 May, 2021 12:33 IST|Sakshi

ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాత్తె` సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. 35 రోజుల చిత్రీకరణ తర్వాత షెడ్యూల్‌ పూర్తి కాగానే హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. స్నేహితుడితో కలిసి బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు. 

అక్క‌డి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో ర‌జనీకాంత్‌, మోహ‌న్‌బాబుతో క‌లిసి దిగిన ఫోటోల‌ను హీరో మంచు విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..' అంటూ దీనికి క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

చదవండి: రజనీతో సెల్ఫీ షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు