Manchu Vishnu: లీక్‌ల బెడద.. ఏదైనా అధికారికంగా ప్రకటిస్తాం: మంచు విష్ణు

25 Sep, 2023 21:16 IST|Sakshi

టాలీవుడ్ హీరో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్‌ సనన్‌ కథానాయికగా కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ విశేషాలను తెలియజేస్తూ మంచు విష్ణు చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం నా ఏడేళ్ల కల అని.. శివుడు, పార్వతి దేవి దివ్య ఆశీర్వాదాలతోనే ఇది సాధ్యమైందంటూ పోస్ట్ చేశారు. 

ఈరోజు న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో 'కన్నప్ప' షూటింగ్‌ను ప్రారంభించాం. నా ఏడేళ్ల  కల సాకారం శివుడు, పార్వతి దేవి దివ్య ఆశీర్వాదానికి నిదర్శనం. గత ఎనిమిది నెలలుగా కన్నప్పలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిద్రలేని రాత్రులు మిగిలాయి. పండుగలు మరచిపోయి.. సెలవులు మానేసి.. 5 గంటల నిద్రనే ఆనందంగా భావించారు. ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి తొలిసారిగా కన్నప్ప భావనను నాతో పంచుకున్నప్పుడు.. నేను తక్షణమే ఆకర్షితుడయ్యాను. కథను మరింతగా మెరుగుపరచడానికి నేను బాధ్యత తీసుకున్నా. ఈ ప్రయాణంలో నాతో కలిసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దిగ్గజాలైన పరచూరి గోపాలకృష్ణ , విజయేంద్ర ప్రసాద్ ,  తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి , ఈశ్వర్ రెడ్డి స్క్రిప్ట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

అంతే కాకుండా.. 'కన్నప్ప'కి ప్రాణం పోసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది తారాగణం, సిబ్బంది న్యూజిలాండ్‌లో కలిశాం. ప్రియమైన వారిని విడిచిపెట్టి వారు చేసిన త్యాగాలే ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకానికి నిదర్శనం. ఈ ప్రయాణంలో నన్ను నమ్మిన మా నాన్నగారి తిరుగులేని మద్దతు .. అలాగే నా సోదరుడు వినయ్ ప్రోత్సాహం నిరంతరం బలం, ప్రేరణగా నిలిచాయి. అంటూ పోస్ట్ చేశారు.  

 'కన్నప్ప'లో అద్భుతమైన నటీనటులు ఉన్నారని.. ఈ జాబితాను త్వరలోనే తెలియజేస్తామని చెప్పేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా ప్రాజెక్ట్ వివరాలను గోప్యంగా ఉంచేందుకు మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ.. లీక్‌ల బెడద సవాలుగా మారిందన్నారు. మా చిత్రంలో నటీనటులకు సంబంధించి అధికారిక ప్రొడక్షన్ (ట్విట్టర్) వచ్చే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అభిమానులందరినీ  అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 'కన్నప్ప' కేవలం ప్రాజెక్ట్ కాదు.. ప్రేమ, అంకితభావం, విశ్వాసంతో చేస్తున్న సాహసమని తెలిపారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు