Viranica Manchu: చెన్నైలో మంచు విష్ణు సతీమణి సందడి

15 Apr, 2022 06:18 IST|Sakshi

తమిళసినిమా: టాలీవుడ్‌ స్టార్‌ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు సతీమణి వెరోనికా పాప్‌ అప్‌ షోతో సందడి చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె న్యూయార్క్‌లో జ్యువెలరీ డిజైనింగ్‌ చేశారు. వివాహానంతరం ఫ్యాషన్‌ మార్కెటింగ్‌ రంగంలోకి ప్రవేశించి హైదరాబాదులో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ షాప్‌ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా చెన్నైలో తన ఫ్యాషన్‌ మార్కెటింగ్‌ విస్తరించేందుకు లేబుల్‌ విడా పేరుతో పాప్‌ అప్‌ షో నిర్వహించారు. నటులు జయం రవి భార్య ఆర్తి, సినీ ప్రముఖులు, మహిళలు ఇందులో పాల్గొన్నారు.  

చదవండి: ('కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్‌-3 కూడా?)

మరిన్ని వార్తలు