మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. ఆయనే నా జీవితం: మందిర

15 Aug, 2021 17:29 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త, సినీ దర్శకుడు రాజ్‌ కౌశల్‌ను గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. రాజ్‌ కౌశల్‌(49) జూన్‌ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే.  నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా భర్తను స్మరించుకున్న మందిరా బేడీ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘ఆగస్టు 15 ఎల్లప్పుడూ వేడుకగా ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర్య దినోత్సవం, రాజ్‌ పుట్టిరోజు. హ్యాపీ బర్త్‌డే రాజీ.. మేము నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. నీవు మమ్మల్ని చూస్తున్నావని ఆశిస్తున్నా. నీవు లేని ఈ శూన్యత ఎన్నటికీ పూరించలేం. నీవు మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. మా జీవితం ’’ అని ఎమోషనల్‌ అయ్యారు.

మందిరా బేడీ మళ్లీ తన పనిలో..
ఆగష్టు 14న మందిరా బేడీ తన కొత్త ఫోటోను షేర్ చేసింది. ఆమె మళ్లీ తన పనిలో నిమగ్నమైనట్లు అభిమానులకు తెలియజేసింది. ఈ ఫోటోలో ఆమె మెరూన్ జాకెట్‌, బూడిద, నలుపు రంగు చీరను ధరించి ఉంది. ఆమె స్మోకీ కళ్ళతో ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. " అందరికీ కృతజ్ఞతలు. నేను తిరిగి పని మొదలు పెట్టాను. మీరు నా పై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఆరోగ్యం ఉన్నాను.’’ అంటూ కామెంట్‌ చేశారు.  

కాగా మందిర- రాజ్‌ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్‌ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్‌ నిఖిల్‌, ప్యార్‌ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్‌ చేసిన రాజ్‌ కౌశల్‌.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్‌ చేశారు.
 

A post shared by Mandira Bedi (@mandirabedi)

A post shared by Mandira Bedi (@mandirabedi)

మరిన్ని వార్తలు