అరవై రోజులు ఆగకుండా...!

3 Feb, 2021 08:19 IST|Sakshi

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ కళాదర్శకుడు తోట తరణి ఐదు భారీ సెట్స్‌ వేశారని సమాచారం. తాజా షెడ్యూల్‌ను అరవై రోజుల పాటు ప్లాన్‌ చేశారట. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్‌ టాక్‌. చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 

మరిన్ని వార్తలు