ఛలో శ్రీలంక

5 Sep, 2020 04:52 IST|Sakshi

కరోనా తర్వాత తమిళ పరిశ్రమలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న తొలి భారీ చిత్రం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని సమాచారం. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్‌కి ముందు థాయ్‌ల్యాండ్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తాజాగా శ్రీలంకలో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించాలని ప్లాన్‌ చేశారట. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ అనే నవల ఆధారంగా తెరకెక్కుతోంది.

మరిన్ని వార్తలు