Manike Mage Hithe: ‘మాణికే మాగే హితే’, ఎవరీ యొహాని డి సిల్వా

6 Sep, 2021 20:23 IST|Sakshi

ఈ మధ్య తెలుగులో బుల్లెట్‌ బండి పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఎక్కడా చూసిన, బయట ఎక్కడికి వెళ్లిన ఈ పాటే వినిపిస్తోంది. ఇక ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన నవ వధువు ఏకంగా ‘బుల్లెట్‌ బండి వధువు’గా మారిపోయింది. ఇదిలా ఉంగగా బుల్లెట్‌ బండి పాట లాగే మరో పాట కూడా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్‌ చూసిన ఈ పాటే దర్శనం ఇస్తోంది. అంతలా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ఈ పాట ఎంటా? అనుకుంటున్నారా!. అదేనండి ‘మాణికే మాగే హితే’ అనే తమిళ పాట. దీనికి అర్థం తెలియకపోయిన మన తెలుగు వాళ్లు సైతం ఈ పాటకు, సింగర్‌కు ఫిదా అయిపోయారు. అంతలా ఈ లిరిక్స్‌, ట్యూన్‌తో సింగిత ప్రియులను కట్టిపడేసి ఈ పాట బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ను సైతం ఆకట్టుకుంది. 

చదవండి: బిగ్‌బాస్‌ 5: అడ్డంగా బుక్కైన లోబో..ఆడేసుకుంటున్న నెటిజన్లు

తాజాగా ఆయన సోషల్‌ మీడియా వేదిక ఈ పాట యూట్యూబ్‌ను లింక్‌ను షేర్‌ చేస్తూ ఈ పాటకు తనని ఎంతగా మంత్రముగ్ధున్ని చేసిందో వివరించారు. దీని లిరిక్స్‌ అర్థం కాకపోయిన తన మనసుకు ఈ పాట చెప్పలేని అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ పాట తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళితో పాటు పలు భాషల్లో కూడా డబ్‌ అయ్యింది. అయినప్పటికి మలయాళంలోనే ఈ పాట ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. మన తెలుగు వారు సైతం దీనికి ఇన్‌స్టా రిల్స్‌ చేస్తున్నారు. దీంతో ఈ పాటను అంత మధురంగా ఆలపించినా ఈ సింగర్‌ ఎవరా అని, ఆమె పేరు ఎంటని నెటిజన్లు సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ట్రెండింగ్‌గా మారింది. మరి మీరు కూడా ఆ గాయనీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఓ లుక్కేయండి. 

చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!

ఇంతకి ఎవరీ ‘మాణికే మాగే హితే’ యొహాని డి సిల్వా:
మాణికే మాగే హితే పాటను పాడింది శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్‌ సింగర్‌. ఆమె పేరు యొహాని డి సిల్వా. తను పాప్‌ సింగర్‌ మాత్రమే కాదు గేయ రచయిత, నిర్మాత, బిజినెస్‌ ఉమెన్‌ కూడా. తొలుత యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌ వేదికగా ఎన్నో పాప్‌ పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే ఆమెను ‘రాప్‌ ప్రిన్సెస్‌’ అనే బిరుదు కూడా వరించింది. తన పాటలతో స్టార్‌ గుర్తింపు తెచ్చుకున్న యొహాని 2021 మే నెలలో మాణికే మాగే హితే పాటను ఆలపించి యూట్యూబ్‌ ఛానల్‌లో వదిలింది.

చదవండి: Akshay Kumar: అక్షయ్‌ కుమార్‌ తల్లికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స

అంతే ఈ పాటతో ఆమె ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందలా తనకు గుర్తింపు తెచ్చిన ఈ పాట యూట్యూబ్‌లో 8 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. కాగా యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి కాగా తల్లి ఎయిర్‌హోస్టెస్‌ అట. కూతురికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి ఆమె తల్లి ప్రోత్సాహం అందించారని ఆమె ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా యొహాని డిసెల్వా గురించి తెలిసి చిన్న వయసులోనే బిబినెస్‌ ఉమెన్‌గా, గేయ రచయితగా, నిర్మాతగా ఎదగడం నిజంగా గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు