‘అవికా-మనీశ్‌లకు సీక్రెట్‌ బిడ్డ’: స్పందించిన నటుడు

24 Jun, 2021 17:50 IST|Sakshi

‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్‌ అవికా గౌర్‌ తన సహ నటుడు మనీశ్‌ రాయ్‌సింఘన్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉందని, వారిద్దరికి సీక్రెట్‌గా ఓ బిడ్డ కూడా ఉందంటూ రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది కాస్తా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై అవికా స్పందిస్తూ.. ‘మనీష్‌ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మేము ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం’ అంటూ ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. అలాగే  దీనిపై నటుడు మనీశ్‌  రాయ్‌సింఘన్‌ కూడా తాజాగా స్పందించాడు. 

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీశ్‌ మాట్లాడుతూ... అవీకా, తను సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడించాడు. ‘అవికా నేను మంచి స్నేహితులం. తను చెప్పినట్లుగా మా మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని. సస్రూల్‌ సిమర్‌ కా సీరియల్‌ నుంచి మా మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది. ఇక మాకు సీక్రెట్‌గా ఓ బిడ్డ కూడా జన్మించిందని అనడం దారుణం. ఇది విని మొదట షాక్‌ అయ్యాను. కానీ ఇలాంటివి ఎలా సృష్టిస్తారా? అని ఆ తర్వాత నవ్వుకున్న. ఇది చూసి నా భార్య సంగీత కూడా నవ్వుకుంది’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు. 

కాగా మనీశ్‌ రాయ్‌సింఘన్‌ గతేడాది జూన్‌లో భార్య సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక అవికా కూడా ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌టీవీ రౌడీస్‌ కంటెస్టెంట్‌ మిలింద్‌ చంద్వాణీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తననే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల స్పష్టం చేసింది. కాగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగులో బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది. సౌత్‌లో పలు సినిమాల్లో నటించి ఫేమ్ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం నాగ చైతన్య, రాశీఖన్నాల 'థాంక్యూ' సినిమాలో నటిస్తోంది.

చదవండి: 
నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్‌
పెళ్లికి సిద్దం, అతడు ఎప్పుడంటే అప్పుడే: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు